Header Banner

యుద్ధం ఎవరూ కోరుకోరు..! కాల్పుల విరమణ వేళ పవన్ కామెంట్స్..!

  Sat May 10, 2025 22:10        Politics

భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా పలువురు స్వాగతిస్తున్నారు. అదే సమయంలో విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో సర్వమత సమ్మేళనం జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, మతపెద్దలు హాజరయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. మతం కంటే మానవత్వమే ముఖ్యమని ఆయన తెలిపారు.

పహల్గాం ఘటన దేశాన్ని కలచివేసిందని, దేశం సహనానికి మారుపేరని ఆయన తెలిపారు. అన్ని ధర్మాలు, మతాలు విలసిల్లాలని అందరూ కోరుకుంటామన్నారు. రాజ్యాంగం రాక ముందు నుంచే ఈ సంస్కృతి ఉందన్నారు. ఉగ్రవాదం ఎప్పుడూ మన వెంటే ఉన్న ప్రమాదం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలో చూసిన నేల ఇది అని పవన్ తెలిపారు. మన మతాలు వేరైనా అంతా భారతీయులమే అన్నారు. ఈ సందేశం దేశం మొత్తానికి చేరాలన్నారు.

ఈ దేశాన్ని విడగొడదాం, విభజిద్దాం అని ఎన్నో శక్తులు ప్రయత్నిస్తుంటాయని, కానీ సగటు మనిషి మతానికి అతీతం అన్నారు. యుద్ధం కావాలని, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోరని,కానీ తప్పనిసరి అయ్యే యుద్ద పరిస్ధితులు వచ్చాయన్నారు. ఇదంతా ముగిసిపోవాలని, ఆ శుభవార్త కూడా త్వరలో వింటామన్నారు. అంతా ఏకమై తమ వారికి మతం కంటే దేశం గొప్పదనే సందేశం అందించాలన్నారు. మతం ఏదైనా మానవత్వానికే పెద్దపీట వేయాలన్నారు. తమ డీఎన్ఏలో దీన్ని భాగంగా మార్చుకోవాలన్నారు. మన బలగాలకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ పవన్ అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PawanKalyan #CeasefireComments #PeaceNotWar #IndiaPakistan #PawanSpeaks #WarAndPeace #JanaSenaChief